AP: తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు లేదని ఈడీ , సీబీఐ చెప్పిందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పెనమలూరు సభలో ఆయన మాట్లాడుతూ.. ‘తిరుపతి వేంకటేశ్వరస్వామి ఎంత గొప్పవాడో ఇంతకంటే నిదర్శనం ఏముంది. మతం మార్చి ఓటు బ్యాంకుగా తీర్చిదిద్దారని జగన్‌పై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. అధికారం కోసం ఎంత దుర్మార్గానికైనా దిగుతారా? మీ కులం తప్ప మరో కులం అధికారంలో ఉండకూడదా?’ అని ప్రశ్నించారు.