ముగిసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ

26చూసినవారు
ముగిసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ
లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడున్నర గంటలపాటు ప్రశ్నించిన అనంతరం, తనను ఫోన్ డేటా ట్రాన్స్ఫర్ కోసమే పిలిచారని, స్కామ్ తో తనకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్ కేసిరెడ్డి పేరు తప్ప మరేమీ చెప్పలేదని, తిరుమల వెంకన్న సాక్షిగా తాను తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదివరకే రెండుసార్లు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్