AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. విచారణలో భాగంగా సునీల్ యాదవ్ ను రెండో రోజు 4 గంటలపాటు ప్రశ్నించారు. ఈడీ అధికారులు A1 ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్రెడ్డిలతో సునీల్ యాదవ్కు ఉన్న కాల్స్ వివరాలపై ఆరా తీశారు. గూగుల్ టెక్ అవుట్ వివరాలను ముందుపెట్టి ప్రశ్నించినట్లు సమాచారం. వివేకా హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని సునీల్ యాదవ్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.