బ్యాంకు మోసం కేసులకు సంబంధించి అనిల్ అంబానీ గ్రూప్‌తో అనుబంధం ఉన్న కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎస్ బ్యాంక్‌లకు సంబంధించిన కేసులలో సుమారు రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తులలో బ్యాంకు బ్యాలెన్స్‌లు, రాబడులు, అన్‌లిస్టెడ్ కంపెనీలలో వాటాలు, స్థిరాస్తులు ఉన్నాయి. గతంలో రూ.10,117 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయగా, మొత్తం జప్తులు ఇప్పుడు సుమారు రూ.12,000 కోట్లకు చేరాయి. ప్రజా నిధులను దుర్వినియోగం చేసి, నిధులను దారి మళ్లించారని ED ఆరోపించింది. దర్యాప్తు కొనసాగుతోందని, నేర ఆదాయాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ED పేర్కొంది.