AP: మాజీ మంత్రి,
వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గతంలో వ్యక్తిగత కారణాలు, ఇతర పనుల వల్ల హాజరు కాలేకపోయిన అంబటి రాంబాబు ఈసారి విచారణకు వెళ్తారా లేక మినహాయింపు కోరతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 28న ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని, ఇది వైసీపీకి పెద్ద షాక్ కలిగించవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.