పేదలకు చదువు భారం కాకూడదు: వైఎస్ జగన్

57చూసినవారు
పేదలకు చదువు భారం కాకూడదు: వైఎస్ జగన్
AP: వైసీపీ విద్యార్థి విభాగం సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, పేదలకు విద్య భారం కాకూడదని అన్నారు. 'చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని ధ్వంసం చేస్తోందని విమర్శించారు. రూ. 4,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ. 2,200 కోట్ల వసతి దీవెన నిధులు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, అందులో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే 1.2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని' జగన్ గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్