నటి ఈషా రెబ్బా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే చెల్లెలి పాత్రలో ఈషా నటించారు. మొదట్లో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా కాకుండా వేరే పాత్రలు చేస్తే భవిష్యత్తులో అలాంటి రోల్స్ వస్తాయని భయపడ్డానని తెలిపారు. సినిమా విడుదలయ్యాక చాలామంది ఆ పాత్రలో ఏముందని అడిగితే బాధపడ్డానన్నారు.