నైరుతి రుతుపవనాల రాక ఎఫెక్ట్.. ఉదయం వరకు వర్షాలు

51చూసినవారు
నైరుతి రుతుపవనాల రాక ఎఫెక్ట్.. ఉదయం వరకు వర్షాలు
AP: రానున్న ఒకటి రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో, అలాగే ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో  రాత్రి నుంచి ఉదయం వరకు విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెల్లవారుజామున రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్