గుడ్డుతో ఆరోగ్యం.. అపోహలపై స్పష్టత ఇచ్చిన వైద్యులు

8496చూసినవారు
గుడ్డుతో ఆరోగ్యం..  అపోహలపై స్పష్టత ఇచ్చిన వైద్యులు
గుడ్డు ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, ఐరన్ వంటి కీలక పోషకాలతో నిండిన అద్భుత ఆహారమని, ప్రతిరోజూ గుడ్డును ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గుడ్డు కంటి ఆరోగ్యం, మెదడు అభివృద్ధి, జుట్టు, గోళ్ళ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. పచ్చసొన కొలెస్ట్రాల్ పెంచుతుందనే అపోహలను వైద్యులు ఖండించారు. ఆరు నెలల శిశువుల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా గుడ్డును తినవచ్చని, కిడ్నీ సమస్యలు, జాండిస్, డెంగ్యూ, చికెన్ పాక్స్ వంటి సందర్భాలలో తెల్లసొన తీసుకోవడం సురక్షితమని డాక్టర్లు తెలిపారు. నాటుకోడి గుడ్డు ఫామ్ గుడ్డు కంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్