ఏక్ నాథ్ షిండేకు అస్వస్థత.. థానే ఆస్పత్రిలో చికిత్స

11467చూసినవారు
ఏక్ నాథ్ షిండేకు అస్వస్థత.. థానే ఆస్పత్రిలో చికిత్స
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలు, పనిభారం కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాజకీయ నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్