AP: రాష్ట్రంలో మే నుంచి జులై మధ్య లేదా ఆగస్టులో ఎల్ నినో ప్రభావం కనిపించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనివల్ల ఖరీఫ్ సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. మార్చి తొలి వారం నుంచే ఎండలు, ఉక్కపోత పెరిగే సూచనలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.