నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో దేశంలో లోటు వర్షపాతం నమోదవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో పాలు, పెరుగు, నెయ్యి, పనీర్ వంటి పాల ఉత్పత్తులతో పాటు పప్పుధాన్యాలు, వంట నూనెలు, టమాటా, ఆకుకూరలు వంటి కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పశుగ్రాసం కొరత, వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల వల్ల సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలే పరిస్థితిని నిర్ణయించనున్నాయి.