స్థానిక ఎన్నికల వాయిదా పుకార్లపై ఎన్నికల సంఘం ఫైర్

3చూసినవారు
స్థానిక ఎన్నికల వాయిదా పుకార్లపై ఎన్నికల సంఘం ఫైర్
AP: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం అవుతాయనే వార్తలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లపై కోర్టు కేసుల క్లారిటీ వచ్చాకే ప్రక్రియ ప్రారంభమవుతుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సమాచారాన్ని మీడియా సమావేశాల ద్వారానే వెల్లడిస్తామని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్