అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

8292చూసినవారు
దేశంలోని అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మూడు రాష్ట్రాల్లోని మొత్తం 296 స్థానాలకు ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అస్సాంలో 84.42%, కేరళలో 75.01%, పుదుచ్చేరిలో 86.92% పోలింగ్ నమోదైంది. కర్ణాటక, నాగాలాండ్, త్రిపురలలో జరిగిన ఉపఎన్నికల్లో కూడా గణనీయమైన పోలింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌కు నామినేషన్ల ఉపసంహరణకు, రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ల దాఖలుకు ఇదే చివరి రోజు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్