పవన్ కల్యాణ్ చొరవతో గిరిజన గూడెం‌లో విద్యుత్ కాంతులు (VIDEO)

5004చూసినవారు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం వెలుగులతో నిండిపోయింది. కేంద్ర నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సహకారంతో గ్రామానికి విద్యుత్ సరఫరా కల్పించారు. సుమారు 9.6 కిలోమీటర్ల దూరంలో 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, 17 కుటుంబాలకు ప్రతి ఇంటికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ అందించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ వీడియోని విడుదల చేసింది.