AP: ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట మండలంలోని కాజీపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో విద్యుత్ షాక్‌కు గురై వినుకొండ గురవయ్య(45) మృతి చెందాడు. ఈ మేరకు మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు వేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.