వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవడం, తడిసిన విద్యుత్ పరికరాలు, తెగిపడిన తీగలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, పిడుగుపాట్లు వంటివి తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లకూడదు. ఇంట్లో విద్యుత్ పరికరాలను పొడి చేతులతోనే తాకాలి. ఉరుములు, మెరుపుల సమయంలో మొబైల్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ప్రమాదకరం. రోడ్లపై నీరు నిలిచిన చోట్ల నడవడం, వాహనాలు నడపడం చేయకూడదు. చిన్న చిన్న జాగ్రత్తలతో విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు.