
పరకామణి కేసులో నిందితుడు రవి కుమార్ సంచలన వీడియో
AP: పరకామణి కేసులో నిందితుడు రవి కుమార్ సంచలన వీడియో విడుదల చేశారు. ‘29 ఏప్రిల్ 2023లో పరకామణిలో తప్పు చేశాను. మహా పాపానికి ప్రాయశ్చితంగా నా ఆస్తిలో 90% స్వామి వారికి ఇవ్వాలని భావించా. నేను మా కుటుంబం అనుకున్న విధంగానే నా ఆస్తి స్వామివారి పేరిట రాశాం. నాపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, నా ఆస్తులు రాసుకున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వారిపై కేసులు కూడా పెట్టాను’ అని అన్నారు.




