AP: చిత్తూరు పరదరామి అటవీ ప్రాంతంలో గాయపడిన ఏనుగు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్వీ జూపార్క్‌లో పోస్టుమార్టం నిర్వహించిన ఏనుగును అధికారులు ఖననం చేశారు. గత నెల 30న చిత్తూరు పరదరామి రిజర్వ్ ఫారెస్ట్‌లోని గుడ్డివాని చెరువులో ఏనుగు గాయపడింది. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. నీటి బురదలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో ఏనుగు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.