ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కూతురును షాప్‌కు పంపి భర్తను చున్నీతో చంపిన భార్య
Jun 23, 2026, 09:06 IST/

కూతురును షాప్‌కు పంపి భర్తను చున్నీతో చంపిన భార్య

Jun 23, 2026, 09:06 IST
TG: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఓ మహిళ తన భర్తను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బోడ నర్సింగ్, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా, స్వరూపకు అదే ఊరికి చెందిన మోహన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప, జూన్ 20న కూతురిని షాప్‌కు పంపి, భర్తను చున్నీతో గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలడంతో, పోలీసులు స్వరూపను విచారించగా నేరం అంగీకరించింది. ప్రియుడు మోహన్ పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది.