AP: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి చుట్టూ కూటమిలో కోల్డ్‌వార్ మొదలైంది. 2014, 2021 ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికైన షేక్ నూర్జహాన్ పెదబాబు వలస నేతల చేతుల్లోనే పదవి ఉండిపోయిందని అభిప్రాయం ఉంది. ఈసారి డైరెక్ట్ ఎన్నిక కావడంతో
టీడీపీ,
జనసేన ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ తన అనుచరగణానికి దక్కేలా పావులు కదుపుతుండగా,
జనసేన నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.