ఆచంట: ప్రాణాలకు తెగించి ప్రయాణం!

1270చూసినవారు
ఆచంట: ప్రాణాలకు తెగించి ప్రయాణం!
ఆచంట మండలం పెదమల్లంలంక, అయోధ్యలంక, పల్లిపాలెం గ్రామాల్లో సుమారు 4 వేల మంది నివసిస్తున్నారు. ఈ గ్రామాలకు గోదావరి దాటడం తప్పనిసరి అయినప్పటికీ, వంతెనలు లేకపోవడంతో వారి ప్రయాణం నిత్యం ప్రాణాపాయంగా మారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెనలు లేక బాహ్యప్రపంచానికి దూరమవుతున్నామని, అధికారులు స్పందించి తమ గ్రామాలకు వంతెనలు నిర్మించాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్