ఆచంట రామేశ్వర స్వామి సత్రంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. రవి మాట్లాడుతూ, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ఉపాధి పనులను నిలిపివేయడం దారుణమని, దీనివల్ల పేద కూలీల జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వీబీజీ-రాంజీ పథకాన్ని రద్దు చేసి, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.