ఆచంట మండలం పరిధిలోని శేషమ్మ చెరువు పాఠశాల SMC (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) చైర్మన్గా చింతపల్లి బాలకృష్ణ, వైస్ చైర్మన్గా నేలపాటి దుర్గప్రసన్న ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకురాలిగా ANM కుమారి వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియను HM త్రిమూర్తులు బుధవారం ధృవీకరించారు. ఈ కార్యక్రమంలో DC చైర్మన్ జక్కంశెట్టి సత్యనారాయణ, TDP ప్రెసిడెంట్ మన్నే రాధాకృష్ణ, కార్యదర్శి కోడి రామకృష్ణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.