అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణకు టాబ్లెట్ల పంపిణీ

1190చూసినవారు
అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణకు టాబ్లెట్ల పంపిణీ
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంట్ర 2 సచివాలయం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు 21, 22లో సోమవారం డి వార్మింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు నులిపురుగుల నివారణకు అల్ బెండ జోల్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. పిల్లల్లో నులిపురుగుల నివారణకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు. అనంతరం పిల్లలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సువర్ణ, విజయమ్మ, ఎంఎల్హెచ్పీ, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్