ఆక్వా మేత ధరల తగ్గింపునకు రైతుల బంద్

1148చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు, ఆక్వా మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, నరసాపురం మండలాల్లో మంగళవారం ఆక్వా రైతులు బంద్ చేపట్టారు. ఈ బంద్‌కు ఫీడ్ డీలర్లు కూడా మద్దతు తెలిపారు. రైతుల వద్ద బకాయిలు పెరిగిపోతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెనుమంట్ర మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్