పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామంలో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎన్సీడీ సర్వే నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధుల వివరాలు సేకరించడంతో పాటు సీజనల్ వ్యాధులు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.