పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బుధవారం పెనుమంట్ర కేంద్రంతో పాటు బ్రాహ్మణచెరువు తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా రాజీవ్ కాలనీ, చర్చి సమీపంలోని ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారి సైతం నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.