పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పరిధిలోని పెనుమంట్రలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ రాజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన స్థానిక పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు బాధితులకు మౌలిక వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు సాయిరామరాజు, పండురాజు తదితరులు పాల్గొని బాధితులకు తమ సహాయ సహకారాలను అందించారు.