మార్టేరులో కిసాన్ మేళా: మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం

356చూసినవారు
మార్టేరులో కిసాన్ మేళా: మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కిసాన్ మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం శతాబ్ది వేడుకలకు చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఐదేళ్లలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైందని, గోదావరి జిల్లాల్లో కాలువల అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకెళ్తోందని, రానున్న కాలంలో వ్యవసాయ కాలువల ప్రక్షాళన చేపడతామని, 2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్