అచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణపై వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి ప్రసాద్ చేసిన విమర్శలను వీరవాసరం మండలం శెట్టిబలిజ, గౌడ, శ్రీశయన, యాత, ఈడిగ సమాఖ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ, సంఘానికి కుల పెద్దగా ఉన్న పితానిపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. రంగరాజు పల్లకి మోస్తున్న గురు ప్రసాద్ బ్రతుకు ఏంటో అందరికీ తెలుసునని విమర్శించారు.