భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయ్ పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం జడ్పీ హైస్కూల్ ల్లో ఘనంగా నిర్వహించారు. సావిత్రి భాయ్ పూలే చూపిన మార్గం ద్వారా నేడు మహిళలు విద్యలో ఉన్నత స్థాయిలో ఉన్నారని పాఠశాల హెచ్ ఎం పౌలు ప్రకాశం, సెకండ్ హెచ్ ఎం శ్రీనివాస్ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.