మార్టేరు కిసాన్ మేళా: పోలవరం 2027 నాటికి పూర్తి - మంత్రి అచ్చెన్నాయుడు

222చూసినవారు
మార్టేరు కిసాన్ మేళా: పోలవరం 2027 నాటికి పూర్తి - మంత్రి అచ్చెన్నాయుడు
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కిసాన్ మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గతంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైందని, కాలువల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం శతాబ్ది వేడుకలకు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని చెప్పారు. అధికారులు ప్రకృతి వ్యవసాయం, తక్కువ పురుగుమందుల వినియోగంపై రైతులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్