రాత్రిపూట వాహనదారులు అప్రమత్తం: కొత్త దోపిడీ ముప్పు

194చూసినవారు
రాత్రిపూట వాహనదారులు అప్రమత్తం: కొత్త దోపిడీ ముప్పు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రాత్రిపూట వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. దుండగులు రోడ్డు పక్కన మొబైల్ ఫోన్ లైట్ ఆన్ చేసి కింద పడేసి, వాహనం ఆపిన వెంటనే దాడి చేసి నగలు, డబ్బు, మొబైల్, పర్సులు దోచుకుంటున్నారని తెలిపారు. అనుమానం వస్తే వాహనం ఆపకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఘటనలు ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్