పెనుమంట్రలో పోషణమాసం, అంగన్వాడీ ఉత్సవం

1439చూసినవారు
పెనుమంట్రలో పోషణమాసం, అంగన్వాడీ ఉత్సవం
పెనుమంట్ర మండల కేంద్రంలోని స్థానిక పెదచెరువుగట్టు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణమాసం, అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ మండల అధ్యక్షుడు మారుతీకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు గంట వాసు చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్ మంగతాయారుతో పాటు పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాను, సురేష్ రాజు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్