కూటమి పాలనపై ప్రజల తీవ్ర వ్యతిరేకత: వైసీపీ నేతల విమర్శలు

272చూసినవారు
కూటమి పాలనపై ప్రజల తీవ్ర వ్యతిరేకత: వైసీపీ నేతల విమర్శలు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆచంటలో 'జంగిల్ రాజా' కొనసాగుతోందని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయని, మాజీ సీఎం జగన్‌పై తప్పుడు పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్