మారుటేరులో శారదామృత సేవా ట్రస్ట్ సేవలు: అన్నదానం, వస్త్రాల పంపిణీ

263చూసినవారు
మారుటేరులో శారదామృత సేవా ట్రస్ట్ సేవలు: అన్నదానం, వస్త్రాల పంపిణీ
ఏప్రిల్ 8న పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరులో శారదామృత సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం, గో సేవ, వస్త్రాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ ప్రారంభం నుంచి వేలాది మందికి అన్నదానం, గోవులకు కూరగాయలు, వానరాలకు అరటిపండ్లు అందించింది. యాచకులు, దివ్యాంగులు, వృద్ధులకు రగ్గులు, చీరలు పంపిణీ చేయడంతో పాటు వైద్య సహాయం కూడా అందించారు. సేవే లక్ష్యమని ట్రస్ట్ ఫౌండర్ డా. వి సత్యహరి తెలిపారు. విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్