పోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించడానికి దగ్గర్లో ఉన్న గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ వైద్యసేవలు అందిస్తున్నట్టు వైద్య అధికారిణి శ్రీవాసవి వెల్లడించారు. బుధవారం ఆమె పలువురు గర్భిణీలకు వైద్య
పరీక్షలు చేసి, వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచించారు. హెచ్ ఓ రమేష్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, పీహెచ్ ఎన్ మీరమ్మ, ఇతర వైద్య సిబ్బంది పద్మకుమారి, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.