ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ హైస్కూల్ స్కూల్లో ప్లస్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పోడూరు మండలం వల్లూరుకు చెందిన ఉండవల్లి సౌమ్యకు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ బాబు చేతులమీదుగా మంగళవారం షైనింగ్ స్టార్ సన్మానం లభించింది. ఆమె 989 మార్కులు సాధించి, మంత్రి చేతులమీదుగా లాప్టాప్ అందుకున్నట్లు హైస్కూల్ HM ఆకన రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ ఎం, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు ఆమెను అభినందించారు.