పెనుమంట్ర తహసీల్దార్ గా టీ. రాజరాజేశ్వరి బాధ్యతలు స్వీకరణ

1717చూసినవారు
పెనుమంట్ర తహసీల్దార్ గా టీ. రాజరాజేశ్వరి బాధ్యతలు స్వీకరణ
పెనుమంట్ర మండల నూతన తహసీల్దార్ గా టీ. రాజరాజేశ్వరి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె తాడేపల్లిగూడెం మండలం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. సాధారణ బదిలీలలో భాగంగా, గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ వై. రవికుమార్ పెంటపాడు మండలానికి బదిలీ అయ్యారు. నూతన తహసీల్దార్ రాజరాజేశ్వరి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, పలువురు వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్