ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి 7 గంటల తర్వాత వాహనాలు నడపడం ప్రజలకు కష్టంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనాల LED హెడ్‌లైట్ల తీవ్ర కాంతి వల్ల కళ్ళు మసకబారి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వాహనాల్లో LED లైట్లు ఎక్కువగా ఉండటంతో సమస్య తీవ్రమైందని, RTO అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు. గతంలో అమలులో ఉన్న హెడ్‌లైట్లకు సగం బ్లాక్ స్టిక్కర్ నిబంధనను పునరుద్ధరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.