వైసీపీ విద్యార్థి నాయకుడిపై కక్షసాధింపు: వైసీపీ ఆరోపణ

2516చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పనుగంటి చైతన్యపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు. పోడూరు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి సూర్య వెంకట గణేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నించిన వారిని అణిచివేసే ప్రయత్నం దారుణమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్