
పెనుగొండలో వాతావరణం మారింది: ఎండ తర్వాత కుండపోత వర్షం
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాసింది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి కుండపోత వర్షం కురిసింది. దీంతో పార్కు ఎదురుగా, గోంగూర తోమి సెంటర్ వంటి కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కొద్దిసేపు ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విభిన్న వాతావరణ మార్పులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.



































