
భీమవరం: నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటాం
మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. బుధవారం వీరవాసరం గ్రామంలోని ఎంఆర్కె జెడ్పి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, సుమారు 100 మందికి పైగా ఉన్న బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.





































