భీమవరం పట్టణంలో కొలువైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన భక్తులు 40 రకాల సారెను సమర్పించారు. స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, చలివిడి పానకం వంటి వాటిని అమ్మవారికి నివేదించారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.