భీమవరం సమీపంలోని గొల్లవాని తిప్ప యనమదుర్రు డ్రైన్‌లో కిక్కిస తొలగిస్తుండగా ఒక కొండచిలువ బయటపడింది. దీనిని చూసిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. హనుమన్ వజ్ర సర్ప మిత్ర టీం సహకారంతో అటవీ అధికారులు ఆ కొండచిలువను పట్టుకున్నారు. ఇది ఇండియన్ రాక్ ఫైతన్ జాతికి చెందినదని అధికారులు తెలిపారు. సమీప అడవుల్లో దీనిని వదిలిపెడతామని వారు పేర్కొన్నారు.