అమరావతి మన రాజధాని: కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు

281చూసినవారు
అమరావతి మన రాజధాని: కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు
రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ, అమరావతి మన రాజధాని అని గర్వంగా చాటుకోవాలని, ఇది ప్రజా ప్రభుత్వం సాధించిన విజయమని అన్నారు. ఈ సందర్భంగా భీమవరంలోని 5, 8, 9, 14, 26, 29 వార్డులలో సంబరాలు నిర్వహించి, రంగవల్లులు వేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్