భగవద్గీత శ్లోక పఠన పోటీలు భీమవరంలో ఈనెల 11, 12న

653చూసినవారు
భగవద్గీత శ్లోక పఠన పోటీలు భీమవరంలో ఈనెల 11, 12న
భీమవరంలో ఈనెల 11, 12 తేదీల్లో ఉద్దరాజు ఆనందరాజు పౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహించనున్నారు. ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు బుధవారం పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాలపై మూడు విభాగాల్లో పోటీలు జరుగుతాయి. సబ్ జూనియర్స్ (5-10 ఏళ్లు) 31-40 శ్లోకాలు, జూనియర్స్ (11-18 ఏళ్లు) 71-90 శ్లోకాలు, సీనియర్స్ (19 ఏళ్లు పైబడినవారు) 108 శ్లోకాలపై పోటీపడతారు.

సంబంధిత పోస్ట్