బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం: న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ

183చూసినవారు
బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం: న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ
భీమవరం PSM గర్ల్స్ హైస్కూల్లో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సివిల్ జడ్జి సీ. రమ్య మాట్లాడుతూ, చదువుకునే వయస్సులో పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూటన్, అంబేద్కర్, వెంకటరమణ, ఉష, సునీత, SI కిరణ్ కుమార్, పాఠశాల HM సాయి ప్రసాద్, నాగేంద్ర కుమార్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్