భీమవరంలో ఆక్వా బంద్

2027చూసినవారు
పెరిగిన ఆక్వా మేత ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆక్వా సంఘం పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా మేత, మెడికల్ షాపులను మూసివేసి బంద్ పాటించారు. ఆక్వా రైతులకు మద్దతుగా తాము కూడా షాపులు మూసివేసినట్లు ఆక్వా బేస్ గ్రూప్ చైర్మన్ బొమ్మిడి రవి శ్రీనివాస్ తెలిపారు. ఇరాన్ యుద్ధం వల్ల ముడి సరుకుల ధరలు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్